calender_icon.png 6 April, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు నిరసన

05-04-2025 09:03:21 PM

10 నెలలుగా మినీ అంగన్వాడీ టీచర్లు పూర్తి వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఎగణామంపై తీవ్ర అసంతృప్తి...

మంత్రి సీతక్క తొలి సంతకం అమలకు మోక్షం లేదా..   

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ విమర్శ..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అంగనవాడి టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, స్వయంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేసిన తొలి సంతకం నేటికీ అమలు కానీ వైనం అని ఎఐటిఎస్సి రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ గజమెత్తాడు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో ఐసీడియస్ లో మినీ అంగన్వాడీ కేంద్రాలులో పని చేస్తున్న టీచర్స్  రెండు రకాల పనులు చేస్తున్నారని, వర్కర్ పని, టీచర్స్ పనులు చేస్తున్న సందర్బంగా అనేక పోరాటాలు నేపథ్యంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 24 రోజుల సమ్మె భాగంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మంత్రి సత్యవతి రాథోడ్ 4వేల మినీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా ప్రమోట్ చేస్తూ కేంద్రం ప్రభుత్వానికి లేఖ పంపి అనుమతి పొందిన విషయం విధితమే.

అదే సమయంలో ఎన్నికలు కోడ్ రావటం ప్రభుత్వం మార్పు జరిగి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఐసీడియస్ శాఖ మంత్రి సీతక్క ప్రమాణం అనంతరం తొలి సంతకం మినీ అంగన్వాడీ కేంద్రాలు ని మెయిన్ సెంటర్ లగ ప్రమోట్ చేసి జీవో ఇచ్చి అట్టి పదోన్నతి పొందిన వారికీ మంత్రులు, ఎమ్మెల్యేల చేతులు మీదుగా ప్రమోషన్ కాపీ లు అందించారన్నారు. పెరిగిన వేతనం 4 నెలలు పాటు రూ7,650 నుండి రూ 13 650 పెంచి ఇచ్చారు. ఆ తరువాత నుండి గత 10 నెలలు గా పెంచిన జీతం ఇవ్వకుండా సగం జీతం ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సీతక్క తోలి సంతకంకి ప్రభుత్వంలో విలువ లేదా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్ జీతాలు ఏరియర్స్  తో పాటు ప్రతి నెల పెరిగిన గౌరవ వేతనం అమలు పర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిల్ ఓ డ్యూటీ రద్దు చేయాలని కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలుని జిఓను అమలు పర్చాలని, పెండింగ్ బిల్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లా ఐసీడియస్ పిడి కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోనే మణి. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి అరుణ, విజయ, సరస్వతి, భారతి, నీరజ, వినోద, లలిత, సరోజని తదితరులు పాల్గొన్నారు.