calender_icon.png 9 January, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి టీచర్‌ను విధుల నుండి తొలగింపు

03-01-2025 12:28:03 AM

ఎల్లారెడ్డిపేట, జనవరి 2: మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ నీరాటి భవాని ని విధుల నుండి తొలగిస్తున్నట్లు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అదే గ్రామానికి చెందిన బెస్త నరేష్ ఫిర్యాదు మేరకు తన కుమారుడు బెస్త సిద్ధార్(4)తో పాటు అందులో చదువుతున్న పిల్లలకు కోడిగుడ్లు పెట్టకపోవడంతో పేరెంట్స్ నిలదీయడంతో బెస్త నరేష్ పై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా,లైంగికంగా వేధిస్తున్నాడని తన ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా.

బాధితుడు జిల్లా కలెక్టర్‌కు ఫి ర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన జిల్లా సం క్షేమ అధికారి, సమగ్ర శిశు అధికారినికి తెలు పకుండా తల్లిదండ్రులను బెదిరించడం పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం విచారణలో తేలగా, గురువారం విచారించిన అనంతరం జిల్లా అధికారులు విధుల నుంచి తొలగిస్తు న్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.