calender_icon.png 27 November, 2024 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో అంగన్వాడీ టీచర్ మృతి

27-11-2024 04:10:36 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం లోని లంబాడి తండ గ్రామపంచాయతీ లోగల అంగన్వాడీ కేంద్రం-190లో టీచరుగా పనిచేస్తున్న ఖమ్మం మెట్ల రమాదేవి (45) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. రమాదేవి గత ఆరు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రమాదేవి మూడుసార్లు కీమో సర్జరీ చేయించుకొని యధావిధిగా విధులకు హాజరవుతుంది. గత మూడు రోజుల కిందట చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆమె బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలు రమాదేవికి భర్త, కుమారుడు ఉన్నారు. బెల్లంపల్లి షంషీర్ నగర్ చెందిన రమాదేవి మృతి పట్ల అంగన్వాడీ టీచర్లు సంతాపం తెలిపారు.