calender_icon.png 7 November, 2024 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలికి వణుకుతూ వానకు తడుస్తూ అంగన్ "బడి"..!

31-08-2024 02:20:11 PM

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు..

  • నాగర్ కర్నూల్, విజయక్రాంతినిర్విరామంగా కురుస్తున్న వర్షాల కారణంగా అంగన్వాడి సెంటర్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వానకు తడుస్తూ చలికి వణుకుతూ గడుపుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ ఎస్సి వాడలోని అంగన్వాడి-2 సెంటర్ పూర్తిస్థాయిలో నిర్మాణానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2014 నుండి కేవలం వంటగదికి మాత్రమే పరిమితమై మిగతా గదుల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు విద్యార్థులు తడుస్తూ చలికి వణుకుతూ గడుపుతున్నారు. ఈ సెంటర్లో 14 మంది విద్యార్థులకు గాను పదిమంది రెగ్యులర్గా అంగన్వాడికి హాజరవుతున్నారు. తాగునీరు నల్ల కాంపౌండ్ వాల్ వాష్రూమ్స్ వంటివి ఏవి నిర్మాణం చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.