calender_icon.png 7 November, 2024 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ అందుబాటులో అంగన్వాడి సేవలు

07-11-2024 05:41:45 PM

సిడిపిఓలు, సూపర్వైజర్లు ప్రతినెల తనిఖీలు చేయాలి

పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ (విజయక్రాంతి): అంగన్వాడి సేవలు అందరికీ అందేలా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి ఐసిడిఎస్ అధికారులు ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమగ్ర శిశు అభివృద్ధి సేవ ఐసిడిఎస్ సేవలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం కోసం ఒక నిర్ణీత దినమును కేటాయించుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడి స్వంత భవనాలలో మరియు కమ్యూనిటీ భవనాలలో నిర్వహిస్తున్న వాటిలో త్రాగునీరు, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని వాటి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

అంగన్వాడీలను అబ్రిడేషన్ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. స్పెషల్ గ్రోత్ మానిటరింగ్ నిర్వహించిన డేటా శాతాన్ని సమర్పించాలని ఆయన అన్నారు. సిడిపిఓలు, సూపర్వైజర్లు ప్రతినెల నిర్దిష్టమైన తనిఖీలు చేపట్టాలని ఆయన సూచించారు. పిల్లల బరువు, తీవ్ర లోపపోషణ, సరిగా బరువులేని పిల్లల సంఖ్య ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు, సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.