హైదరాబాద్: అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్(Anganwadi School Building) స్లాబ్ పెచ్చులు ఊడి పడి చిన్నారులకు తీవ్ర గాయాలైన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. భవనం పైకప్పు పెచ్చులూడి పడటంతో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారులను చికిత్స నిమిత్తం తక్షణమే నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రి(Narayankhed Govt Hospital)కి తరలించారు. చిన్నారులు కలెక్టర్ క్రాంతి, ఎమ్మెల్యే సంజీవ రెడ్డి పరామర్శించారు.