calender_icon.png 23 February, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీలో కొలువులు

23-02-2025 12:46:50 AM

మహిళా శిశు సంక్షేమ శాఖలో జాతర

సర్కారు గ్రీన్‌సిగ్నల్

మొత్తం పోస్టులు 14,236

టీచర్లు: 6,399, హెల్పర్లు: 7,837

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖలోని పోస్టులను త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఈ మేరకు ఆ శాఖ మంత్రి సీతక్క ఫైల్‌పై సంతకం చేశారు. 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.

మొత్తం 14,236 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లను ఆయా జిల్లా కలెక్టర్లే విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఇంత పెద్దసంఖ్యలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీచేయడం ఇదే తొలిసారి. ఖాళీల భర్తీ ప్రక్రియతో అంగన్వాడీ  కేంద్రాలు మరింత పటిష్టం కానున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత కూడా తగ్గే అవకాశముంది.