calender_icon.png 19 April, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్ వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

17-04-2025 05:59:28 PM

ఎమ్మెల్యే కోరం కనకయ్య..

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల లెవెల్ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని గురువారం ప్రగళ్లపాడు రైతు వేదికలో నిర్వహించారు. ఐసిడిఎస్ సిడిపిఓ కేఎం తార ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులందరికీ పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు. ఈ పోషణ పక్వాడ భాగంగా సీమంతాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు, చిరుధాన్యాలతో వంటల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధికారిని స్వర్ణలత లెనినా, టేకులపల్లి ఎంపీడీవో రవీందర్ రావు, ఎంపీ ఓ గణేష్ గాంధీ, ఎస్సై రాజేందర్, మండల కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, సూపర్వైజర్లు అనురాధ, నిర్మల, యశోద, లక్ష్మి, ఖలీదా, టేకులపల్లి మండల అంగన్వాడీ టీచర్స్ హాజరైనారు.