calender_icon.png 4 March, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్‌కు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు

04-03-2025 12:14:09 AM

జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బోనగిరి నరేశ్ 

జగిత్యాల అర్బన్, మార్చ్ 3 (విజయక్రాంతి) : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలలో విద్యాబోధన జరగాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బోనగిరి నరేష్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని పలు అంగన్వాడి కేంద్రాలను జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్పుర జెడ్.పి.హె.యస్, జండామయిళా, ముఖరాంపుర, సౌరాలవాడ, కృష్ణనగర్ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి కేంద్రాల నిర్వహణ, లబ్ధిదారుల హాజరు, తదితర విషయాలను పరిశీలించారు.

ప్రిస్కూల్ పిల్లల నమోదు పెంచాలని, ప్రీ ప్రైమరీ విద్య  ప్రాముఖ్యత ను వివరిస్తూ అంగన్వాడీ కేంద్రంలో బోధన ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిర్వహించాలని అంగన్వాడీ టీచర్స్ ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన వెంట సీడీపీఓ మమత,  ఈఓ పవిత్ర, సూపర్వుజర్స్  కవితారాణి, స్వరూపరాణి తదితరులున్నారు.