బెల్లంపల్లి, (విజయక్రాంతి): ప్రభుత్వం చిన్నారుల ఆలనా పాలన చూసేందుకు అంగన్వాడీ కేంద్రాలకు తుది మెరుగులు దిద్ది అందుబాటులోకి తీసుకువచ్చిన సిబ్బంది పనితీరు వల్ల అవి సక్రమంగా తెలుసుకోవడం లేదు. బెల్లంపల్లి మండలం లోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల లక్ష్మీపూర్-33 అంగన్వాడి కేంద్రం బుధవారం మధ్యాహ్నం సమయంలో తాళం వేసి ఉండడం ఇందుకు నిదర్శనం. ఐదేళ్ల లోపు చిన్నారులకు అమ్మ ఒడిలా, గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య ప్రదాయిని గా ఉండాల్సిన ఈ కేంద్రం నిర్లక్ష్యానికి నిలువుటద్దం దర్శనమిచ్చింది. అంగన్వాడి టీచర్ ఏదైనా సమావేశాలకు హాజరైతే సంబంధిత ఆయా కేంద్రాన్ని తెరిచి ఉంచాల్సి ఉన్నప్పటికీ లక్ష్మీపూర్ అంగన్వాడి కేంద్రం మాత్రం మధ్యాహ్నం సమయంలో తాళం వేసి కనిపించింది.