calender_icon.png 15 October, 2024 | 8:58 AM

మత్తు వైద్యుడు లేక గర్భిణుల ఇక్కట్లు

15-10-2024 12:12:56 AM

  1. గంటల పాటు నిరీక్షించిన వైనం

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

హుజురాబాద్, అక్టోబర్ 14: మత్తు వై ద్యుడు అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు గంటలపాటు ఆపరేషన్ల కోసం గంట ల పాటు నిరీక్షించిన సంఘటన హుజురాబా ద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవా రం జరిగింది. సోమవారం ఉదయం ప్రస వం కోసం ఆరుగురు గర్భిణులు ఆసుపత్రికి వచ్చారు.

ఆపరేషన్ కోసం ఆసుపత్రి సిబ్బం ది యూరిన్ కేథటర్ వేసి సిద్ధంగా ఉంచారు. అయితే మత్తు డాక్టర్ అందుబాటులో లేడని వైద్యురాలు ఆపరేషన్లు నిలిపివేశారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు మత్తు డాక్ట ర్ రాకపోవడంతో గర్భిణులు తీవ్ర అవస్థలు పడ్డారు. వారి కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లారు.

దీ ంతో ఏరియా ఆసుపత్రి వైద్య ఉన్నతాధికారులు స్పందించి మత్తు డాక్టర్‌ను పంపించా రు. రాత్రి 6:30 గంటల సమయంలో ఆపరేషన్లు మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మత్తు డాక్టర్ లేకపోతే ఆ యన స్థానంలో మరొక డాక్టర్‌ను ఏర్పాటు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.