calender_icon.png 18 March, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగూర్ సాగునీటి ఎడమ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలి

17-03-2025 08:24:39 PM

ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్

ఆందోల్: సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ(Singur Project Left Canal)కు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం పుల్కల్ మండలంలోని లక్ష్మీ సాగర్ గ్రామాల్లో యాసంగిలో తాగు చేసిన వరి పంటకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సాగునీళ్లు అందకపోవడం వల్ల చేతికి వచ్చిన పంట ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. గత పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలలుగా కాలువ మరమ్మత్తుల పేరు మీద నీళ్లు వదలక పోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం సాగునీరు విడుదల చేయమని ముందుగా ప్రకటిస్తే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేవారున్నారు.

ప్రభుత్వం సింగూర్ నీళ్లను వదలకపోతే రైతులతో కలిసి ప్రాజెక్టు నీటిని పంటలకు వదులుకుంటామని హెచ్చరించారు. ఒక వారం రోజులలో ఒక సారి నీళ్లు వదిలితే ఇప్పుడున్న పంటను కాపాడే పరిస్థితి ఉందన్నారు. సింగూరు నీటిని వ్యవసాయ పంటలకు వదులుతారని రైతులు ఆశతో ఉన్నారని ప్రభుత్వం, మంత్రి రాజనర్సింహ ఆలోచించి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సింగూర్ ప్రాజెక్టులో 22 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. సింగూరు నీటిని విడుదల చేసే వరకు పోరాటం చేస్తామన్నారు .సింగూర్ ప్రాజెక్ట్ కింద సాగు చేసిన వరి పంటలన మాజీ డిసీసీబీ వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ తో పాటు పలువురు పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.