అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన చిరంజీవి(32) లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో వెళ్తున్న ఆయన కారు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది. చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చిరంజీవి మృతితో బూదవాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.