calender_icon.png 24 December, 2024 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్.. హాజరైన పవన్ కల్యాణ్

16-10-2024 02:47:23 PM

అమరావతి: ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయింది. కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీ, పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపైనా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించారు. నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామికవేత్త అశంతో ఎంఎస్ఎంఈ పాలసీని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై మంత్రివర్గం చర్చించింది. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై, డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణపై మంత్రుల కమిటీల నియామకం, ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ నియామకంపైనా చర్చించారు. అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.