అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు 50 శాతం పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. మాచర్ల, పుంగునూరు వంటి చోట్ల దాడులు జరిగినా దాని ప్రభావం పోలింగ్ కనిపించలేదని అధికారులు తెలిపారు. తెనాలిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓటేసేందుకు భారీగా తరలివస్తున్నారు ఓటర్లు. అటు గుంటూరు జిల్లా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ పై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్ ను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. పోలింగ్ పూర్తి అయ్యేంత వరకు శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.