calender_icon.png 17 April, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధి రేటులో పురోగతి సాధించిన ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే రెండో స్థానం

15-04-2025 05:08:47 PM

అమరావతి,(విజయక్రాంతి): 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానాన్ని దక్కించుకుందని జాతీయ గణాంకాలు వెల్లడించాయి. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా పురోగతి సాధిస్తోంది. ఈ విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందింస్తూ ఆయన ఆలోచనలను పంచుకున్నారు. తన గత పదవీకాలానికి సమాంతరంగా దీనిని గుర్తు చేసుకున్నారు.

1990 లలో తను మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు హైదరాబాద్ నగరం రెండవ స్థానంలో, బెంగళూరు నంబర్ వన్ స్థానంలో ఉండేదన్నారు. కానీ నేడు, హైదరాబాద్ అన్ని రంగాలలో నంబర్ వన్ గా నిలిచిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అదేవిధంగా నేడు మనం ఒక కొత్త సవాలును లేదా కొత్త అవకాశాలను అందుకుంటాన్నాం, మనం దీనిని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని స్పష్టం చేశారు. రెండవ స్థానంలో ఉండటం అంటే మనం మరింత కష్టపడి పనిచేయాలని చంద్రబాబు అన్నారు.