calender_icon.png 26 December, 2024 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత జాతి గర్వించదగిన గొప్ప నేత అటల్ బిహారీ వాజ్‌పేయి

25-12-2024 05:37:07 PM

మహేశ్వరం,(విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్ గూల్ గ్రామంలో 9వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల సునీత, శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. మహానేత అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్రీరాములు  మాట్లాడుతూ ..వాజ్‌పేయి  దేశ రాజకీయాల్లో నైతిక విలువలకు పట్టం కట్టిన గొప్ప నాయకుడిని, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని, ప్రధానిగా సైనిక శక్తిని, రక్షణ రంగాన్ని ఎంతగానో బలోపేతం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా దేశం అభివృద్ధి చెందాలంటే రోడ్ల కనెక్టివిటీ ద్వారా అభివృద్ధి చెందుతుందని గ్రహించి  గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ పెంచారన్నారు, జాతీయ రహదారుల రూపకల్పనలో తన ముద్ర మరువలేనిదని అన్నారు, ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.