calender_icon.png 16 January, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెల రవళిది.. అద్భుత నాట్యమిది

27-08-2024 12:06:32 AM

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాం తి): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశం మొత్తం సంబురాలు జరిగాయి. ఎవరికి తోచిన విధంగా వారు చిన్ని కిట్టయ్యను ఆరాధించి తరించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీవిజయ శంకర స్వామీజీ ఆశీస్సులతో సురభి వినాయక నాట్య మండిలి లో సోమవారం శాస్త్రీయ నృత్య కళా ప్రదర్శన నిర్వహించారు. ఇందులో చిన్నారుల నృత్య ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నా యి. గురువు కిరణ్మయి మార్గదర్శకత్వంలో నాట్యం నేర్చుకుంటున్న మనస్వి, శార్వని, అర్షిత, నిధాయతి సాయి, నీహారిక, పూర్వి, గరిమ, భువిక, జేశ్విత, కార్తీక, ధ్రితి, దేవాన్ష, ఆరాధ్య, లీసా, ఓంసాయి బృందం ప్రదర్శన హైలెట్‌గా నిలిచింది.  కళాకారులను శ్రీ విజయశంకర స్వామీజీ సత్కరించి ప్రశంసా పత్రాలు అందించారు.