వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇందులో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా, అతని మాజీ లవర్‌గా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘మీను’ అనే పాటను రిలీజ్ చేశారు. భార్య ఐశ్వర్య రాజేశ్‌తో వెంకటేశ్ తన ప్రేమకథను వివరిస్తూ సాగే పాట ఇది. ‘నా లైఫులోనున్న ఆ ప్రేమ పేజీ తీనా.. పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా..’ అంటూ సాగుతున్న ఈ పాట అందరికీ ప్రేమలో పడిన తొలి రోజుల్ని గుర్తు చేసేలా ఉంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్యతో కలిసి పాడారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి; స్క్రీన్‌ప్లే: ఎస్ కృష్ణ, జీ ఆదినారాయణ; యాక్షన్ కొరియోగ్రఫీ: వీ వెంకట్.