calender_icon.png 17 November, 2024 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక ‘వాటర్ ఫీజిబిలిటీ’ సులభతరం

17-11-2024 01:26:48 AM

జలమండలి ప్రధాన కార్యాలయం నుంచి ధ్రువపత్రాల జారీ

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి) : కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి జలమండలి శుభవార్త చెప్పింది. గ్రేటర్ పరిధిలో నూతన భవనం నిర్మించాలంటే జీహెచ్‌ఎంసీ అనుమతి తప్పనిసరి. ఆ అనుమతి కోసం ఇంటి యజమానులు విద్యుత్ ఫీజిబిలిటీతో పాటు జలమండలి జారీచేసే వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది.

ఆ వాటర్ ఫీజిబిలిటీ జారీచేసే ప్రక్రియను తాజాగా జలమండలి సులభతరం చేసింది. గతంలో ఈ సర్టిఫికెట్స్ పొందాలంటే జలమండలి సర్కిల్ కార్యాలయాల్లో సీజీఎం జారీ చేసేవారు.  వివిధ కారణాల రీత్యా ఈ ప్రక్రియ లో జాప్యం జరిగేది. దీన్ని నివారించి.. ఆ ప్రక్రియను సులభతరం చేయడానికి ధ్రువప త్రాల జారీని జలమండలి కేంద్ర కార్యాలయం నుంచే చేపట్టేలా తాజాగా మార్పు లు చేశారు.

ఈ క్రమంలో వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రాలు జారీ చేయడానికి జలమండలి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. వినియో గదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈ కమిటీ ధ్రువపత్రాలు జారీ చేస్తుం ది. ఈ ధ్రువపత్రాల కోసం వినియోగదారులు ముందుగా తమ దగ్గర్లోని సీజీఎంలకు దరఖాస్తు సమర్పించాలి.

వారు 6 రోజుల్లోపు దరఖాస్తులను పరిశీలించి జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్న కమిటీకి పంపిస్తారు. సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులు 30 రోజుల్లోగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తుల పరిశీలన తర్వాత 5 రోజుల్లో రెవెన్యూ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ ధ్రువపత్రాల్ని జారీచేస్తారు. దీంతో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ధ్రుపత్రాల విషయంలో జాప్యం జరగకుండా ఉంటుంది.  ఈనెలలో ఇప్పటికే 19 వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రాల్ని జారీ చేశారు.