calender_icon.png 5 February, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటు ప్రతిభ ప్రాభావికత

22-01-2025 12:00:00 AM

అభ్యంతరం, బాహ్యం, గుహ్యం, ప్రకాశమ్, అత్యయికమ్, ఉపేక్షితవ్యం వా కార్యం ఇదమేవమ్ ఇతి విశేషయేఛ్ఛ!

- కౌటిలీయం

“ఏ కార్యం అభ్యంతరమో అంటే ఆం తరంగికమైందో, ఏది బాహ్యమో అంటే ప్రజలకు సంబంధించిందో, ఏది రహస్యమో, ఏది ప్రకాశంగా చెప్పవచ్చో, ఏది అత్యయికమో లేదా వెంటనే చూడాలో, ఏది కొంతకాలం ఉపేక్షించవచ్చునో.. ఇది ఇలా అని స్పష్టంగా రాతపూర్వకంగా విశదీకరించాలి” అంటాడు చాణక్య. రాత పూర్వకంగా స్పష్టంగా లేనిది ఏదైనా నీటిమీది రాతల వలెనే నిలవదు.

ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి, దానిని సాధించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకునే నాయకుడు విజేత అవుతాడు. దానికి స్పష్టమైన లక్ష్యనిర్దేశనతో కూడిన దార్శనికత అవసరమవుతుంది.

చేయవలసిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పెట్టుకోవడం, ఏ సమయంలో ఏ కార్యా న్ని నిర్వహించాలో స్పష్టంగా నిర్ణయించుకొని, ఆ సమయానికా ప్రకారంగా పూర్తి చేయడం, క్రియాశీల ప్రణాళికను సిద్ధం చేసుకోవడం, క్రమశిక్షణతో కార్యాచరణ ప్రణాళికను అమలుచేయడం, అర్హతనుబట్టి బాధ్యతలు అనుచరులకు అప్పగించ డం వంటివన్నీ అవసరం.

కార్యాన్ని మనమే నిర్వహిస్తే అది మన సమర్థత అయితే, అర్హత ప్రాతిపదికగా బాధ్యతలను అప్పగిస్తే అది మన ప్రభావశీలత అవుతుంది. కోకిల మాత్రమే తన పాటలోని మాధుర్యాన్ని గుర్తిస్తుందే కాని కాకి గుర్తించలేదు. అలాగే, ప్రతిభావంతులైన అనుచరులను గుర్తించి వారికి బాధ్యతలను అప్పగించేందుకు సమర్థత కావాలి. 

ప్రతిభావంతమైన, సమర్ధవంతమైన బృందాలను తయారుచేసి వాటిని పటిష్టంగా పనిచేయించడం.. ప్రభావవంతమై న భావవ్యక్తీకరణ నైపుణ్యాన్ని సంతరించుకోవడం, కొత్త వాతావరణంలోనైనా ప్రజలతో, సంఘటనలతో సర్దుకు పో యేందుకు  మానసికంగా సన్నద్ధమవ డం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎదుర య్యే ఒత్తిడులను, సమస్యలను, సవాళ్ళను, ఇబ్బందులను, అధిగమించేందు కు పటిష్టమైన వ్యూహాలను తయారుచేసుకోవడం, చేసే పని, విలువలు, నమ్మ కాలు, ప్రవర్తనలలో నిబద్ధత, నిరంతరం నేర్చుకునే మనస్సు, పనిలో స్థిరత్వం కలిగి ఉండడం.. ఇవి కార్యనిర్వహణలో విజయాన్ని సమకూర్చే కొన్ని అంశాలు.

నాయకుడు వీటిని అలవాట్లుగా చేసుకోవడం అవసరం. కార్యాచరణ ప్రణాళికను అమలు చే యడంలో నాయకుడు దేనిని తాను మా త్రమే విచారించాలో దానిని ఒంటరిగానే ఆలోచించాలి. కార్యం పూర్తయ్యే వరకు దానిని బహిర్గతం కానీయరాదు. అలాగే, ప్రజలమధ్య చర్చ చేయవలసిన అంశా లు బహిర్గతం చేయడం వల్ల ఉత్పత్తుల నాణ్యతకు సంబంధించి వినియోగదారుల అనుక్రియను లేదా ప్రతిక్రియను అంచనా వేసే వీలుంటుంది.

అందులో సానుకూలమైన అంశాలను స్వీకరించే అవకాశం క లగడమేకాక ఉత్పత్తులకు అయాచితమైన ప్రచారం లభిస్తుంది. రహస్యంగా ఉంచాల్సిన వాటిని అంతరంగికులతో చర్చించా లి. అవసరమైన విషయాలను అందరితో చర్చించడం ‘బ్రెయిన్ స్టార్మింగ్’ అంటా రు. దానివల్ల ఊహించని సూచనలు కిందిస్థాయి వారినుండి కూడా రావచ్చు. అవి సంస్థకు ఉపయుక్తం కావచ్చు.

వివేకంతో లక్ష్యసాధన

ముఖ్యంగా ఏ పనులు ముఖ్యమో, వే టిని వెంటనే చూడాలో వాటిపై తక్షణమే దృష్టిని కేంద్రీకరించాలి. కాలపరిమితి ముగిసే ప్రాజెక్టులు, తలపైకి వచ్చిన క్లిష్టమైన పరిస్థితులు దీని కిందికి వస్తాయి. అలాగే ఏవైతే ముఖ్యమే కాని వెంటనే చూడాల్సినవి కావో వాటిని తదుపరి నిర్వహించుకోవడం మంచిది. వ్యక్తిగత సంబంధాలను పెంచుకోవడం, అవకాశాలను గుర్తించడం, ప్రణాళికలను రచించు కొంటూ చర్చించుకోవడం వంటివన్నీ ఈ పట్టిక కిందకు చేర్చవచ్చు.

కొన్ని వెంటనే చూడాలి కాని ముఖ్యమైనవి కానివి ఉం టాయి. రిపోర్టులు పంపడం, ఉత్తరాలు రాయడం, చూడడం లాంటివి. అవసరం ప్రాతిపదికగా వీటిని నిర్వహించుకోవాలి. కొన్ని ముఖ్యమూ కావు,వెంటనే చూడాల్సినవీ కావు, మయాన్ని వృథా చేసేవి, వినోదాలు విలాసాల వంటివి సమయానుకూలంగా నిర్వహించుకోవాలి. 

ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి కార్యాన్ని ఆరంభించిన సమయంలో ఆ లక్ష్యం కేంద్రంగా మన వివేకాన్ని ఉన్నతీకరించాలి. వివేకంతో దార్శనికత పరిధిని పెంచాలి. కార్యనిర్వహణలో శక్తి సామర్థ్యాలు పూర్తిగా వినియోగితం కావాలి. కార్యం పూర్తయ్యేంత వరకు దాని భద్రతను పట్టించుకోవాలి. నిజానికి అవన్నీ పరస్పరాధారితాలుగా ఉంటాయి. 

 పాలకుర్తి రామమూర్తి