calender_icon.png 1 November, 2024 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రత్న భండార్‌లో పురాతన ఆయుధాలు

21-07-2024 01:26:59 AM

బయటపడ్డ కత్తులు, కిరీటాలు, వజ్ర వైడూర్యాలు

12వ శతాబ్ధపు రాజులకు చెందినవిగా గుర్తింపు

స్ట్రాంగ్ రూమ్‌కు తరలించిన అధికారులు

భువనేశ్వర్, జూలై 20 : పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భండార్‌లోని మూ డో గదిలో ఉన్న సంపదను లెక్కించేందుకు అధికారులు శనివారం స్ట్రాంగ్‌రూమ్‌లకు త రలించారు. సంపద తరలింపు పూర్తయిన త ర్వాత భండాగారానికి తాళం వేసి సీజ్ చేశా రు. ఈ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేశారు. రత్న భండాగారంలో అపార సంపద బయటపడింది. రాజులు యుద్ధాల్లో ఉపయోగించిన కత్తులు, కిరీటాలు, ఇతర పు రాతన ఆయుధాలు బయటపడ్డాయి. యు ద్ధాల్లో విజయం సాధించిన అనంతరం బంగారం, ఇతర వస్తువులను రత్న భండార్‌లో భద్రపర్చినట్లు అధికారులు పేర్కొన్నా రు.

“జూలై 14న రత్న భండార్‌లో కొన్ని పురాతన విగ్రహాలను కనుగొన్నాము. లోప లి గదిలో కత్తులు, కిరీటాలు, స్వర్ణ సింహాసనాలు, అమ్మవారి వడ్డానాలు, బంగారు వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్రవైడూర్యాలు కనిపించాయి. అయితే, ఇవి న లుపు రంగులోకి మారాయి” అని కమిటీ సభ్యుల్లో ఒకరు చెప్పారు. ఈ ఆయుధాలు 12వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులకు చెందినవిగా ప్రాధమిక అంచనాకు వచ్చా రు. తూర్పు గాంగా వంశానికి చెందిన అనంతవర్మన్ చోడగాంగా దేవ్ 1190లలో పూరీ ఆలయాన్ని నిర్మించాడని, ఆయనే ఈ ఆయుధాలను రత్న భండార్‌లో దాచి ఉండవచ్చని చెబుతున్నారు. “ఆలయాన్ని కాపాడేందుకు అప్పటి రాజులు పురాతన ఆయుధాలను రత్నభం డారంలో దాచి ఉంచవచ్చు” అని ఆలయ సేవకుడు శ్యామ్ మహాపాత్ర పేర్కొన్నారు.