12-02-2025 09:03:04 PM
బిగ్ బాస్ ఫెమ్ గంగవ్వ..
బాసర (విజయక్రాంతి): పల్లె గ్రామాలలో నాటి కథలే మాకు స్ఫూర్తిదాయకమని వాటితోనే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని బిగ్బాస్ ఫేమ్ గంగవ్వ అన్నారు. బుధవారం రోజున ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ఏ గోవర్ధన్ ఆదేశంతో ఇన్ఫ్లుజన్ టాక్స్ టు మై విలేజ్ షో బృందం ఇష్ట గోష్టి చర్చ జరిగింది. ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ... నేటి కాలంలో డిజిటల్ వ్యవస్థ అత్యంత ప్రాధాన్యతను సంచరించుకుందని నాటి కాలంలో పల్లె గ్రామాలలో పిట్ట కథలు ఉండేవని ఆమె అన్నారు. ఆమె ఇష్ట గోషి చర్చలో సుమారు 2000 మంది విద్యార్థులతో పలు ప్రశ్నలతో సమాధానలిస్తూ విద్యార్థులను సంతోషపరిచారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి మురళీ దర్శన్, వైఛాన్సీలర్ గోవర్ధన్, డాక్టర్ రాకేష్ రెడ్డి, ఇష్ట గోష్టి మై విలేజ్ షో వ్యవస్థాపకుడు శ్రీకాంత్ చందు తదితరులు పాల్గొన్నారు.