calender_icon.png 4 October, 2024 | 8:46 AM

5 భాషలకు ప్రాచీన హోదా

04-10-2024 01:31:48 AM

ఆయిల్ సాగుకు 10వేల కోట్లు కేటాయింపు

కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ గురువారం నిర్ణయం తీసుకుంది. దీంతో మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. ఇప్పటికే తెలుగు సహా ఆరు భాషలకు ప్రాచీన హోదా ఉంది.

మొదటగా తమిళ్‌కు 2004 లో ప్రాచీన హోదా ఇవ్వగా సంస్కృతం (2005), తెలుగు, కన్నడ (2008), మలయాళం (2013), ఒడియా (2014)కు గుర్తిం పు లభించింది. ప్రాచీన భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చుతారు. ఢిల్లీ లో గురువారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ భేటీలో మరిన్ని కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

వంటనూనేలు, ఆయిల్ సీడ్స్ మిషన్‌కు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. ఆరేళ్లలో నూనెగింజల ఉత్పత్తికి రూ.10,103 కోట్లు కేంద్రం ఖర్చు చేయనుంది. 2031 నాటికి నూనెగింజలను ఉత్పత్తి 6.97 కోట్ల టన్నుల కు పెంచడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.