30-04-2025 12:00:00 AM
కోదాడ, ఏప్రిల్ 29: కోదాడలోని పాత కబరస్థాన్లో పురాతన శాసనాలు బయటపడ్డ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భూస్థాపత కార్యక్రమం కోసం గుంత తవ్వుతుండగా పురాతన రాగి పలకలు బయటపడ్డయి ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కబరస్తాన్ లో చోటుచేసుకుంది కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఆర్డీవో సూర్యనారాయణ డిఎస్పి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
స్థానికంగా ఉన్న కబరస్తాన్ లో గుంత తవ్వుతుండగా పలు రకాల భాషలలో ఉన్న రాగి పలకలు లభ్యమయ్యాయని వక్సు బోర్డ్ సభ్యులు సమాచారం ఇవ్వడంతో వాటిని స్వాధీన పరుచుకున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించామని వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహసిల్దార్ వాజిద్ అలీ ,పట్టణ సీఐ శివశంకర్ నాయక్, ఎస్సై రంజిత్ రెడ్డి ఆర్‌ఐ రాజేష్, పాల్గొన్నారు.