calender_icon.png 23 February, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగాధరలో పురాతన విగ్రహాలు

16-02-2025 12:00:00 AM

తెలంగాణలో అనేక ప్రాంతాల్లో బుద్ధుడి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఎక్కువగా ఉన్నాయి.  కొద్ది నెలల క్రితం కోట్ల నర్సింహుల పల్లి గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ భూమిలో సాగు చేస్తుండగా పురాతనమైన విగ్రహాలు బయట పడ్డాయి.

కోట్ల నర్సింహులపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి కొండపైన పురాతనమైనటువంటి దేవస్థానం ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. అయితే ఇంతకుముందు కూడా ఇలాగే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా అలాంటి విగ్రహాలు బయటపడటంతో గ్రామస్తులు గమనించి పురావస్తు శాఖకు సమాచారం అందించారు.

అయితే తరుచుగా అక్కడి రైతులు వ్యవసాయ భూమిని దున్నుతుండగా జైనుల కాలం నాటి విగ్రహాలు బయటపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా ఈ ప్రాంతంలో విగ్రహాలు బయటపడుతుండటం గమనార్హం.  

ఎన్నో విగ్రహాలు..

ఇక్కడ పురాతన కాలం నాటి వర్ధమాన మహావీరుని విగ్రహాలు కూడా బయటపడుతున్నాయి. గతేడాది రైతు లు పొలం పనులు చే స్తుండగా.. మూడడుగుల వెడల్పు, నాలుగ డుగులు పొడవున్న మహావీరుని విగ్రహం వెలుగుచూసింది.