calender_icon.png 26 March, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల విచారణకు హాజరైన యాంకర్ శ్యామల

24-03-2025 11:49:50 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ శ్యామల గతంలో తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తదనంతరం ఆమెను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించిన కోర్టు దర్యాప్తుకు సహకరించాలని శ్యామలకు సూచించింది. కోర్టు ఆదేశానికి అనుగుణంగా శ్యామల ఇవాళ విచారణ కోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇదే కేసులో మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీతు చౌదరి, టీవీ యాంకర్ విష్ణుప్రియ కూడా పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.