calender_icon.png 20 April, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రిలో యాంకర్ రష్మీ... అసలు ఏమైందంటే?

20-04-2025 04:50:35 PM

ప్రముఖ టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ ఆసుపత్రి పాలైంది.ఎప్పుడు టీవీ షోస్, ప్రోగ్రామ్స తో బీజీబీజీగా ఉండే రష్మీకి ఇటీవల ఓ శస్త్ర చికిత్స జరిగింది. గత కొన్ని రోజులుగా తను అనారోగ్యంగా ఉన్నంటూ.. అసలు తనకు ఏం అవుతుందో అర్థం కాలేదని చెప్పింది. సుమారుగా ఐదు రోజుల్లోనే తన శరీరంలో హిమోగ్లోబిన్ 5 రోజుల్లో 9 కి పడిపోయిందని వెల్లడించారు. జనవరి నుండి ఆమెకు అకాల రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో ఇబ్బందిపడ్డానన్నారు. ఈ సమస్యపై వైద్యులను సంప్రదిస్తే ఏ సమస్యను మొదట పరిష్కరించాలో నాకు నిజంగా అర్థం కాలేదని చెప్పారు.

మార్చి 29 నుండి శరీరం విశ్రాంతి తీసుకొన్ని, చివరికి తన ప్రస్తుత కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత ఆసుపత్రిలో చేరారు. ఏప్రిల్ 18వ తేదీన ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం రష్మీ ఆరోగ్యంగా నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. మరో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు ఆమె రాసుకొచ్చారు. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో తనకు అండగా నిలిచిన వైద్యులకు, కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పస్తుత తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టి వివరించారు. సర్జరీకి ముందు దిగిన ఫోటోలను రష్మీ గౌతమ్ నెటిజన్లతో పంచుకున్నారు.