ప్రజలు ఓట్లతోనే గులాబీ నేతలకు బుద్ధి చెప్పాలి
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మంథని, మే 11 (విజయక్రాంతి): పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో మంథనిలో కొన్ని అసాంఘిక శక్తులు అరాచకాలు సృష్టించాయని, ఆ పార్టీకి ప్రజలు ఓట్లతోనే బుద్ధి చెప్పాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. మంథని పట్టణంలోని అంబేంద్కర్ చౌరస్తాలో శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలవుతుందని, ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక అప్పుడే కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
అపుడే పుట్టిన బిడ్డ వెంటనే నడుస్తుందా..? అలాగే కాంగ్రెస్ ఉన్న పరిస్థితి అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచి తాను మంథని నియోజవర్గానికి పరిశ్రమలు తీసుకొస్తానన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పేదలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు బాగా జీవిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఎన్టీపీసీ ఎరువుల కర్మగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లంచాలు తీసుకున్నదని ఆరోపించారు. ప్రచారంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమాదేవి, ఎంపీపీ కొండ శంకర్, పార్టీ నేతలు తొట్ల తిరుపతి యాదవ్, ఐలి ప్రసాద్, శశిభూషణ్ కాచె, శ్రీపతి బానయ్య, ముస్కుల సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు విజలక్ష్మి, పద్మ, లక్ష్మీసమ్మయ్య, నాయకులు మూల సరోజన, ఓడ్నాల శ్రీను, అజీంఖాన్, జనగమ నర్సింగరావు, కుడుదుల వెంకన్న పాల్గొన్నారు.