కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్
కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బాన్సువాడ పట్టణంలో బుధవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్షా దివస్ కు భారీ ఎత్తున తరలిరావాలని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పూర్తిగా అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్, రమేశ్ యాదవ్, మోచి గణేశ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.