calender_icon.png 26 November, 2024 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయా..

26-11-2024 12:09:31 AM

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కెరీర్ ఆరంభంలో థెరపీ తీసుకున్నట్టు వచ్చిన వార్తలపై తాజాగా స్పందించారు. ‘కెరీర్ ఆరంభంలో ఎంతో నెగిటివిటీ ఎదుర్కొన్నా. విమర్శల కారణంగా తీవ్రంగా బాధపడ్డా. భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆత్మవిశ్వాసం కోల్పోయి కుంగిపోయా.

సోషల్ మీడియా కామెంట్స్ చదువుతుంటాం కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోం.  కొంతకాలం తర్వాత ఆ కామెంట్స్ గుర్తొచ్చి ఇబ్బందిపెడతాయి. నా విషయంలోనూ అదే జరిగి, థెరపి తీసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఆలోచనా విధానంలో చాలా మార్పొచ్చింది. గతంలోలా ఇప్పుడైతే రెగ్యులర్‌గా చికిత్స తీసుకోవడం లేదు’ అని చెప్పుకొచ్చింది అనన్య పాండే.