calender_icon.png 13 March, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయిన అనన్య

13-03-2025 01:15:50 AM

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా వెండితెరపై అడుగు పెట్టింది అనన్య పాండే. ఆ తరువాత తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునే పనిలో ఉంది. ‘లైగర్’ సక్సెస్ అయి ఉంటే అమ్మడి ఖాతాలో హ్యాట్రిక్ పడి ఫేట్ మారిపోయి ఉండేది కానీ అది కాస్తా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో కాస్త ఇబ్బందిపడింది.

ఇది మాత్రమే కాకుండా కెరీర్‌లో ఎక్కువగా ఓటీటీ చిత్రాలు చేయడంతో అమ్మడికి ఆశించిన క్రేజ్ రాలేదనే చెప్పాలి. ‘ఖాళీ పీలి, గెహరాహియా, ఖో గయా హమ్ కహా’ వంటి చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాల్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. 2023లో వచ్చిన ‘డ్రీమ్ గర్ల్ 2’ తర్వాత ఈ ముద్దుగుమ్మ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఓటీటీ సినిమాలతోనే నెట్టుకొస్తోంది.

ఈ క్రమంలోనే తోటి వారితో పోలిస్తే వెనుకబడి ఉన్నానని ఫీల్ అయ్యిందో ఏమో కానీ సిల్వర్ స్క్రీన్‌పై నజర్ పెట్టింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ పట్టేసింది. ‘చాంద్ మేరా దిల్’తో పాటు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తర్వాత మళ్లీ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తోంది. ఈ చిత్రం మార్చి 15 నుంచి పట్టాలెక్కనుంది. ఇవి మాత్రమే కాకుండా ‘కేసరి’ చాప్టర్ 2లోనూ కనిపిస్తోంది.