సూర్యాపేట, జూలై31 (విజయక్రాంతి): హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పాశం అనంతరావు బుధవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను జిల్లా బీసీ అభివృద్ధి అధికారి అనసూర్య సన్మానించారు. 32 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు అందించిన సేవలను కొనియాడారు. టీఎన్‌జీవోస్ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జానిమాయా, దున్నా శ్యామ్, బీసీ సంక్షేమ శాఖ డివిజన్ అధికారులు ఎస్తేర్, మజాయిద్‌ఖాన్, సిబ్బంది లక్ష్మికాంతమ్మ, భాస్కర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.