calender_icon.png 26 December, 2024 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంత్ జోడీదే మిక్స్‌డ్ టైటిల్

26-12-2024 12:33:33 AM

న్యూఢిల్లీ: భారత షూటర్లు మహేశ్వరీ చౌహన్, అనంత్ జీత్ సింగ్ జోడీ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్కీట్ మిక్స్‌డ్ టీమ్ టైటిల్ నెగ్గింది. బుధవారం డాక్టర్ కర్ణీసింగ్ షూటింగ్ రేంజ్ వేదికగా జరిగిన ఫైనల్లో మహేశ్వరీ జీత్ జంట 44 ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మైరాజ్ అహ్మద్ ఖాన్ ఖాన్ జోడీపై విజయంతో స్వర్ణం కైవసం చేసుకుంది. పంజాబ్‌కు చెందిన గనేమత్ సెకోన్ సింగ్ జంట కాంస్యం గెలుచుకుంది.

అంతకముందు క్వాలిఫయింగ్ దశలో మూడు రౌండ్లు కలిపి మహేశ్వరీ 72, అనంత్ జీత్ 71 స్కోరు నమోదు చేశారు. ఫైనల్‌కు అర్హత సాధించిన టాప్ ఈ జోడీ తొలి స్థానంలో నిలిచింది. జూనియర్ స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మధ్యప్రదేశ్ స్వర్ణం గెలవగా.. హర్యానా రజతం నెగ్గింది. తెలంగాణకు చెందిన మునెక్ బత్తుల దీశావాలా జోడీ కాంస్యం పతకంతో మెరిసింది. కాంస్య పతక పోరులో ఈ జంట రాజస్థాన్‌కు చెందిన యదురాజ్‌యశస్వి రాథోర్ జంటపై 42 నెగ్గింది.