calender_icon.png 22 September, 2024 | 10:09 AM

సీఎం రేవంత్ రెడ్డి విజన్ ఉన్న లీడర్: ఆనంద్ మహీంద్రా

19-09-2024 04:56:06 PM

హైదరాబాద్: తెలంగాణ నుంచి పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించేందుకు స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ అభినందించారు. రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడని, అదే కారణంతో ఆయనను సీఎం రేవంత్ సంప్రదించగా యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండేందుకు అంగీకరించానని చెప్పారు. సచివాలయంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్  శ్రీను రాజు, సీఎస్ శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.