న్యూఢిల్లీ: ప్రపంచ జూనియన్ స్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. హూస్టన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో అనహత్ సింగ్, శౌర్య బవాలు క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. బాలికల ప్రిక్వార్టర్స్‌లో అనహత్ 11-6, 13-11, 11-2తో అకారి మిడోరికవా (జపాన్)పై విజయం సాధించింది. బాలుర ప్రిక్వార్టర్స్‌లో శౌర్య బవా 11-9, 5-11, 11-5, 13-11తో సిగుండో పోర్టబలెస్ (అర్జెంటీనా)పై విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రపంచ జూనియర్ స్కాష్ చాంపియన్‌షిప్‌లో ఇద్దరు ఆటగాళ్లు భారత్ నుంచి క్వార్టర్స్‌లో ఆడడం ఇదే తొలిసారి.