calender_icon.png 17 November, 2024 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనాడే ఫిక్సయ్యా.. కానీ

17-11-2024 12:00:00 AM

  1. తిలక్ తెలుగువాడు కావడం గర్వకారణం 
  2. ముంబై తరఫున మెరుపులు

* తిలక్ వర్మ.. మాకేంటి ఈ కర్మ అని సఫారీలు అనుకునేలా వరుస సెంచరీలతో వారికి నిద్రలేని రాత్రులు మిగిల్చిన వర్మ గారబ్బాయి మన తెలుగువాడే కావడం గర్వకారణం. 

* గతేడాది ఇదే వేదికగా ఆడిన మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ అయ్యా. మరోమారు అవకాశం వస్తే నిరూపించుకోవాలని ఆనాడే నిర్ణయించుకున్నా. ఈ శతకంతో ఆ లోటు తీరిపోయింది.

2 - టీ20 సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన రెండో క్రికెటర్ తిలక్. సంజూ శాంసన్ మొదటి ప్లేయర్

1 - ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో వరుస మ్యాచ్‌లలో సెంచరీలు చేసిన మొదటి భారత క్రికెటర్ తిలక్

విజయక్రాంతి, ఖేల్ విభాగం: వారం కిందటి వరకూ సగటు క్రికెట్ అభిమానులెవరికీ పెద్దగా పరిచయం లేని తిలక్ వర్మ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయాడు. ఇలా తిలక్ అవతరించ డం వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంది. అ డపాదడపా జాతీయ జట్టులో అవకాశం వ స్తున్నా కానీ ఇంత వరకు తిలక్ పెద్దగా ప్రభా వం చూపలేదు. కానీ సఫారీ టూర్ తిలక్ జీ వితాన్నే మార్చేసింది. ఇన్ని ఘనతలు సాధించిన తిలక్ వర్మది హైదరాబాద్ కావడం గమనార్హం. మనందరికీ గర్వకారణం. 

ఎలక్ట్రీషియన్ ఫ్యామిలీలో.. 

తిలక్ తండ్రి నాగరాజు వర్మ వృత్తి రిత్యా ఎలక్ట్రీషియన్. నవంబర్ 8 2022లో జన్మించిన తిలక్ ఇదే నెల లో వరుస సెంచరీలు చేయడం గమనార్హం. తిలక్ వర్మకు ఒక సోదరుడు తరుణ్ వర్మ ఉన్నారు. దేశవాళీలో మన హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన వర్మ గారబ్బాయి ఐపీఎల్‌లో ముంబై ఇండి యన్స్‌కు మెరుపులు మెరిపిస్తున్నాడు. 

రిటైన్ జాబితాలో

వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం జరగనున్న మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు తిలక్ వర్మను అట్టి పెట్టుకుంది. ఎంతో మంది మహామహులు ఉన్న వారందరినీ వదిలేసి తిలక్ వర్మ మీద ప్రాంచైజీ నమ్మకం ఉంచిందంటే అతి 

ఏ మాత్రం చిన్న విషయం కాదు. తిలక్ వర్మకు సఫారీ టూర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నాలుగో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా తిలక్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఆ విజయం ఎంతో స్పెషల్

సౌతాఫ్రికా గడ్డ మీద టీ20 సిరీస్ విజయం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఎంతో శ్రమిస్తే కానీ  ఈ విజయాలు దక్కలేదు. ఒక్కరని కాకుండా టీం అందరూ సమష్టిగా రాణించారు. వెల్ డన్ బాయ్స్.. కంగ్రాట్యులేషన్స్ టూ ఆల్.. 

 వీవీఎస్ లక్ష్మణ్, భారత 

హెడ్ కోచ్(సౌతాఫ్రికా టూర్)