15-03-2025 12:45:22 AM
సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి
తిమ్మాపూర్ మార్చి 14 విజయ క్రాంతి : నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఏకైక విప్లవ వీరుడు అనభేరి ప్రభాకర్ రావు అని సిపిఐ మండల కార్యదర్శి బోయిన తిరుపతి కొనియాడారు. శుక్రవారం పోరాట విప్లవ వీరుడు అనబెరి ప్రభాకర్ రావు 77వ వర్ధంతి సందర్భంగా సిపిఐ, మండల కామ్రేడ్స్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం గుండెల్లో రణభేరి మోగించిన అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి,లతో పాటు మరో 10 మంది మహమ్మదాపూర్ గుట్టలో రజాకారుల దాడిలో ప్రాణాలు కోల్పోయారన్నారు. నిజాం నవాబు ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో భూస్వామ్య వ్యవస్థ పై రజాకారుల ఆగడాలపై గ్రామాల్లో పటేల్ పట్వారి ఆదిపత్యాన్ని ఎదిరించిన ధీరుడు అనబెరియని 1948 మార్చి 14న రజాకార్ల తుపాకీ గుళ్లకు బలవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఆయన పోరాట కాలంలో కరీంనగర్ జిల్లా సిపిఐ పార్టీ మొట్టమొదటి కార్యదర్శిగా పనిచేశారని కరీంనగర్లో చేనేత సహకార సంఘం ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే 30 వేల మందికి రేషన్ కార్డులు ఇప్పించారని తెలిపారు. నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందిగా రజాకారులను గ్రామాలలో తిరుగనివ్వకుండా విరోచిత పోరాటం చేసి అసువులు బాసిన అమరుడు కామ్రేడ్ అనబెరి ప్రభాకర్ రావ్ అని తెలిపారు.
ఇంతటి గొప్ప వీరుని ప్రభుత్వాలు గుర్తించకపోవడం బాధాకరమని వెంటనే ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి,లను జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్పించి హైదరాబాద్ ట్యాంక్ బండి పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పోలంపల్లి గ్రామ శాఖ కార్యదర్శి ముత్త ఎల్ల స్వామి, కార్యకర్తలు ఐలయ్య, మేకల శ్రీను, గొల్లెన రాజయ్య, మల్లయ్య, రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.