calender_icon.png 1 November, 2024 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన ఎప్‌సెట్

12-05-2024 01:00:52 AM

చివరి రోజు 94.4 శాతం మంది హాజరు

ఈనెల చివరి వారంలో ఫలితాలు

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో టీఎస్ ఎప్‌సెట్  (గతంలో ఎంసెట్) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన శనివారం నాడు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష జరిగింది. తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం 50,812 మంది దరఖాస్తు చేసుకోగా 47,974 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ నుంచి 95.4 శాతం, ఏపీ నుంచి 90.5 శాతం మంది హాజరయ్యారు. ఈనెల 7 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు జరిగాయి.

7, 8వ తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి, 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరిగాయి. ఈ ఐదు రోజులు 90 శాతానికి పైగానే విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎప్‌సెట్ కన్వీనర్ బీ.డీన్ కుమార్ తెలిపారు. పరీక్షలు ముగియడంతో ఇక ఫలితాలపై అధికారులు దృష్టిసారించను న్నారు. ఈనెల చివరి వారంలో ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేయనున్న ట్లు అధికారులు స్పష్టం చేశారు.