03-03-2025 12:00:00 AM
కమిషన్ రేట్‌లో శ్రీపాదరావు జయంతి వేడుకల్లో సీపీ శ్రీనివాస్
రామగుండం, మార్చి 2 (విజయక్రాంతి): రాష్ర్ట రాజకీయాల్లో అజాత శత్రవుగా చిరస్మరణీయుడు శ్రీపాద రావు అని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు. మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమీషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి సీపీ ఘనంగా నివాళులర్పించారు.
శ్రీపాదరావు సర్పంచ్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి, శాసనసభ్యుడిగా, శాసన సభాదిపతిగా పదవి చేపట్టి పదవికే వన్నె తెచ్చారన్నారు. రాష్ట్రానికి ఎనలేని సేవచేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాం ఏసిపి రాఘవేంద్రరావు, ఆర్‌ఐ లు వామన మూర్తి, శ్రీనివాస్, సంపత్, సిసి హరీష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.