28-04-2025 12:23:57 AM
కూసుమంచి , ఏప్రిల్ 27 :-ఆనందం .. ఆప్యాయత.. గత జ్ఞాపకాలు.. చిన్నపాటి భావోద్వేగం ..వీటన్నింటికీ వేదికగా మారింది 2003 - 2005 ఇంటర్మీడియట్ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం.. కూసుమంచి మండల కేంద్రంలోనీ జేవీఆర్ కళాశాలలో 2003 - 2005 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తరువాత అందరూ ఆదివారం మండలంలోని ఓ ప్రవేట్ ఫంక్షన్ లో ఒక చోటుకు చేరి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరిని ఒకరు ఆప్యాయతంగా పలకరించుకున్నారు .
సరదాగా ఆటపాటలతో కాలక్షేపం చేసిన అనంతరం అందరూ కలిసి మంచి బోజనాలు చేసి , చివరిగా గ్రూప్ గా ఫొటోస్ తీసుకున్నారు.. తమకు చదువు చెప్పిన లెక్చరర్స్ నీ ఘనంగా సన్మానించారు.. ఆత్మీయ సమ్మేళనంలో తమ తమ భావాలను పంచుకొని భావద్వేగానికి లోనయ్యారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరయ్య (కెమిస్ట్రీ ) రామకృష్ణారెడ్డి (ఫిజిక్స్) ,వీరభద్రం ,వసుపతి ,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు..