calender_icon.png 1 April, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

25-03-2025 01:35:12 AM

వరంగల్, మార్చి 24(విజయక్రాంతి): వారంతా మూడు దశాబ్దాల క్రితం ఒకే బడిలో చదువుకున్నారు. ఆ తర్వాత పై చదువులు చదివి కొందరు, వ్యాపారాల్లో కొందరు స్థిరపడి ఉన్నత స్థాయికి చేరారు. చాలా రోజుల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో ఒకే చోట కలిసి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

1993-94 బ్యాచ్ జడ్. పి. హెచ్. ఎస్ మొగిలిచర్ల స్కూల్  సమ్మేళనం విద్యార్థులు సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. వారికి చదువు చెప్పిన నాటి గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అప్పటి రోజులను గుర్తుచేసుకొని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతయ్య, హేమామాలిని, పూర్వ విద్యార్థులు  సంతోష్ కుమార్ , శ్రీనివాస్, ఎం. సరిత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.