సూర్యాపేట, జనవరి 26 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ 2 లో 1975-76 సంవత్సరంలో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం 50 సంవత్సరాల పిదప శ్రీ గ్రాండ్ బాంక్వెట్ హాల్ లో ఆదివారం నిర్వహించారు. 65 సంవత్సరాల వయసులో ఉన్న అలనాటి విద్యార్థిని, విద్యార్థులు కలుసుకొని నాటి అనుభవాల ను పంచుకొన్నారు.
అలాగే 90 సంవత్సరాల వయసు గల తమ గురువులు ఎన్ లక్ష్మయ్య, వి.దేవయ్య, చిన్నయ్య లను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్య క్రమంలో నాటి విద్యార్థులు ఏ.జ్ఞానభాస్కర్, గుండా రమేష్, గజ్జల రవీందర్, ఎన్ రంగారావు, పద్మ, కిరణ్మయి, శారద, రేణుక, నంద్యాల దయాకర్ రెడ్డి, యామా ప్రభాకర్ పాల్గొన్నారు.