మంథని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి...
మంథని (విజయక్రాంతి): మంత్రి శ్రీధర్ బాబు అండదండలతో మంథనిలో ఎన్నడూ లేని అభివృద్ధి జరుగుతుందని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి తెలిపారు. మంథని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో 11, కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించారు. 13వ వార్డు సంబంధించి ఎమ్మెన్నార్ నగర్ (ముస్కుల నారాయణరెడ్డి నగర్), పోచమ్మ డబుల్ బెడ్ రూమ్ ఏరియాకి శివ నాగపూరి కాలనీ, 1వ వార్డు పవర్ హౌస్ కాలనీని శ్రీపాద కాలనీగా కొనసాగించుటకు, 1వ వార్డు శ్రీపాద కాలని 10 గుంటల ప్రభుత్వ స్థలంలో 5 గుంటలు బీసీ కమిటీ హాల్, మరొక 5 గుంటలలో తాత్కాలిక గోశాల ఏర్పాటు చేయుటకు, ఇతరత్రా అంశాల మీద తీర్మానం చేశారు. ఈ సమావేశంలో చైర్ పర్సన్, కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ... తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్(Minister Sridhar Babu) బాబు అండదండలతో మంథనిని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని తెలిపారు.
మంథని మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమములో భాగంగా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అభివృద్ధి పనుల ద్వారా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డుకు రోడ్లు, డ్రైనేజీ ఒక కోటి రూపాయలతో 13 వార్డులకు గాను రూ.13.95 కోట్ల రూపాయలు మంజూరి చేయించి ఇప్పటి వరకు 85% శాతం పనులను పూర్తి చేశామన్నారు. మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం, డంపింగ్ యార్డ్ యందు సెగ్రిగేషన్ షెడ్, డి.ఆర్.సి.సి. కంపోస్ట్ షెడ్, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జ్, ఆర్చీల నిర్మాణం కొరకు రూ. 9.20 కోట్లు మంథని పట్టణములో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయుటకు కొరకు రూ. 6.71 కోట్లు వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, వివిధ వార్డులలో సైడ్ డ్రైనులు, సి.సి. రోడ్ల నిర్మాణము కొరకు రూ. 8.14 కోట్లు మంథని మున్సిపాలిటీలో మంత్రి శ్రీధర్ బాబు సహకారముతో మొత్తం (టియుఎఫ్ ఐడిసి) నిధుల ద్వారా రూ. 38.00 కోట్లతో రూపాయలు మంజూరు చేశారని, నూతన హంగులతో ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ కొరకు రూ. 95 లక్షలు మంజూరు చేయించారని, మంథని గోదావరి నది వంతెన నిర్మాణం కొరకు 135 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, వార్డు కౌన్సిలర్లు గుండా విజయలక్ష్మి, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, గర్రెపల్లి సత్యనారాయణ, కొట్టే పద్మ, చొప్పకట్ల హనుమంతరావు, వీకే. రవి, వేములక్ష్మి పాల్గొన్నారు.