calender_icon.png 31 October, 2024 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య

10-08-2024 05:19:41 PM

నల్లగొండ: పట్టణంలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై గుర్తుతెలియని యువకుడు (30)  చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. శనివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి చేతికి స్మార్ట్ వాచీ, ఎడమ చెవికి రింగ్ ఉన్నాయి. ఘటనా స్థలంలో చెప్పులు, బ్యాగు, పర్సు లభించాయి. నల్లగొండ వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందిన యువకుడని సమాచారం. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.