వింత శబ్దాల మిస్టరీని ఛేదించిన సైంటిస్టులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఏడాదిగా అంతుచిక్కకుండా ఉన్న వింత శబ్దాల మిస్టరీని తాజాగా శాస్త్రవేత్తలు ఛేదించారు. 2023 సెప్టెంబరులో భూకంప పరిస్థితులను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలకు ఓ మిస్టరీ సిగ్న ల్ వినిపించింది. ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు ఈ సౌండ్ రికార్డయింది. గతం లో ఇలాంటి శబ్దాలను వినకపోవడంతో శాస్త్రవేత్తలు ఆందోళన చెందారు. గ్రీన్‌లాండ్‌లో భారీ మంచుచరియలు విరిగిపడటమే ఇందుకు కారణమని ఎట్టకేలకు తెలుసుకున్నారు. సెప్టెంబర్‌లో వరుసగా 9 రోజుల పాటు ఈ శబ్దాలు వినిపించాయి.
సాధారణ ప్రకంపనలకు భిన్నంగా వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీతో సౌండ్స్ వినిపించాయి. భూమిలోపల గుర్తుతెలియని వస్తువేదైనా ప్రయాణిస్తుందా? అని అనుమానించారు. ఈ అంశంపై లోతైన పరిశోధనలు చేశారు. చివరకు అవి మంచుచరియల కారణంగా ఏర్పడిన సునామీ అల ల శబ్దాలని తేలింది. తూర్పు గ్రీన్‌లాండ్‌లోని డిక్సన్‌ఫోర్డ్‌లోని ఓ పర్వతం వద్ద గతేడాది మంచుచరియలు విరిగిపడ్డాయి. ఎత్తు నుంచి పడడంతో భూమి ఒక్కసారిగా కంపి ంచింది. సునామీతో 200 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రభావం 9 రోజుల వరకు ఉందని అధ్యయనకారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ 90 సెకన్లకు ఒకసారి ఆ శబ్దాలు వినిపించాయి.