24-02-2025 08:28:45 PM
పటాన్ చెరు: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం శివారు గుట్టల్లో గుర్తుతెలియని యాచకుడు మృతి చెందాడు. సోమవారం సాయంత్రం గ్రామస్తులు గుర్తించి ఐడీఏ బొల్లారం సీఐ రవీందర్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో కలిసి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహం ఆచూకీ తెలిసినవారు ఐడీఏ బొల్లారం పోలీస్ లను సంప్రదించాలని ఆయన కోరారు.