అహ్మదాబాద్, సెప్టెంబర్ 1: దేశంలో ఫుడ్ డెలివరీ వ్యాపారం వేగంగా విస్తరిస్తున్నది. ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా డెలివరీ ఏజెం ట్లు ఉరుకులు పరుగుల మీద ఆహారాన్ని కస్టమర్లకు సరఫరా చేస్తుంటా రు. మండే ఎండలున్నా.. ట్రాఫిక్ ఉన్నా.. వర్షాలు, వరదలు, పిడుగులు పడినా వారి ప్రయాణం అలుపెరుగక సాగుతూనే ఉంటది. గుజరాత్లో ప్రస్తుతం భారీవర్షాలు కురుస్తున్నాయి. బయటకు వెళ్లి ఆహారం తెచ్చుకోలేని యాష్ అనే వ్యక్తి జొమా టో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. బోరున వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ఏజెంట్ ఆర్డర్ తీసుకొచ్చాడు. అయితే కష్టమర్‌కు ఏజెంట్ జన్మదినం అదేరోజు అని జొమాటో తెలిపింది. ఏజెంట్‌ను ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకొన్న యాష్, అతడి మిత్రులతో కలిసి ఏజెంట్ వచ్చి ఫుడ్ ప్యాక్ అందజేయగానే శుభాకాంక్షలు తెలిపి గిఫ్ట్ అందించారు. దీంతో ఆ ఏజెంట్ సంతోషానికి అవధులు లేవు.