calender_icon.png 8 April, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీలకు శుభాకాంక్షల వెల్లువ

08-04-2025 01:08:26 AM

నల్లగొండ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఎన్నికైన విషయం తెలిసింది. వీరితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి  మునుగోడు, మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, నేనావత్ బాలూనాయక్ హాజరై వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు.