calender_icon.png 25 March, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బీజేపీ జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షల వెల్లువ

23-03-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, మార్చి 22 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా బిజెపి రూరల్ అధ్యక్షుడు రాజ్ భూపాల్ రెడ్డికి శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందేల శ్రీరాములు పార్టీ నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో  సన్మానిస్తూ హృదయపూర్వక శుభా కాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అందరం కలిసి సమన్వయంతో పార్టీని విజయపతంలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.